In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. And Janasena has huge loss from the people. Ysrcp got prestigious win. In this issue Konidela Nagendra Babu tweet and put sensetional commets on jagan mohan reddy.
#nagababu
#ysjagan
#pawankalyan
#janasena
#chandrababunaidu
#tdp
#ysrcp
#andhrapradesh
భారీ ఉత్కంఠ నడుమ ఇటీవల వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ఈ ఫలితాలు చూసి ముక్కున వేలేసుకుంది. మరోవైపు జనసేన పరిస్థితి అంతకంటే దారుణం. ఈ రెండు పార్టీలను ఊడ్చేస్తూ భారీ మెజారిటీతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఏపీ ప్రజలు. ఈ ఫలితాలు చుసిన ప్రజానీకం, రాజకీయ పండితులు చంద్రబాబుపై ఓ రేంజ్ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌పై కౌంటర్స్ వేస్తూనే చంద్రబాబును సమర్థిస్తూ నాగబాబు పెట్టిన వరుస ట్వీట్స్ మరో సంచలనంగా మారాయి.
నిజానికి జనసేన పవన్ కళ్యాణ్ స్థాపించిన పెద్ద దిక్కుగా అన్నీ తానై చూసుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. స్వయంగా తాను కూడా నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఏదో సాధించేద్దాం అనుకున్నారు.. కానీ రిసల్ట్ చూసి కంగుతిన్నారు. మరోవైపు టీడీపీ కూడా ఇంచుమించుగా జనసేన లాగే భారీగా దెబ్బతింది.