Telugu state has the highest temperature at 47-48 degrees today.The Department of Weather pointed out that people should be careful and do not go in the sun.Weather scientists are exploring four factors.
#telangana
#temperature
#districts
#sun
#public
#problems
#Adilabad
#marriages
వామ్మో ఏం ఉక్క పోతరా నాయనా.. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఈ స్థాయి ఎండలను చూడలేదు.. అమ్మో ఇవేం ఎండలు.. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం... ఎండలపై జనాల మాట ఇది. ఉష్ణోగ్రత 42డిగ్రీలు దాటితేనే ఉక్కిరిబిక్కిరవుతాం! ఇప్పుడు 45డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఇంతగా పెరిగిపోవడానికి కారణమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఇందుకు నాలుగు కారణాలను విశ్లేషిస్తున్నారు.
ఈ వేసవి సీజన్‌లోనే ఏప్రిల్‌లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఫణి తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. సాధారణంగా ఎండాకాలంలో గాలిలో తేమ 35 నుంచి 40 శాతం దాకా ఉంటుంది. ‘ఫణి' ప్రభావంతో గాలిలో తేమ 15 శాతం నుంచి 20 శాతం తగ్గిపోయింది. తేమ తగ్గిపోవటంతో ఎండ తీవ్రత పెరిగిపోయింది. కాగా, తెలంగాణ కోర్ హీట్‌వేవ్' జోన్‌లో ఉంది. రాజస్థాన్ నుంచి మొదలయ్యే జోన్‌లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘగఢ్, ఒడిసా, ఏపీ రాష్ట్రాలు ఈ జోన్ పరిఽధిలో ఉన్నాయి. ఉత్తర భారతం నుంచి వచ్చే గాలులు ఇక్కడ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.