“With the blessings of people of Secunderabad and honourable Prime Minister Narendra Modi I will be taking oath as the Union Minister today at 7 p.m. I seek your continued support,” tweeted newly-elected BJP MP Gangapuram Kishan Reddy on receiving the much awaited call from party president Amit Shah on Thursday afternoon.
#kishanreddy
#telangana
#bjp
#modi
#amithashah
#venkaiahnaidu
#delhi
#UnionMinister
ఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి నక్క తోక తొక్కారు. మంత్రి అయ్యే అదృష్టం రాసుంటే ఎవ్వరూ ఆపలేరు అన్న చందంగా ఆయనను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. 14 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ముందస్తు ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ ఓటమే ఇప్పుడు ఆయనను మంత్రిని చేసింది . గెలిస్తే మహా అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి శాసనసభాపక్ష నేత అయ్యేవారు. కానీ, ఇప్పుడు ఏకంగా కేంద్ర క్యాబినెట్ లోనే స్థానం దక్కించుకున్నారు.
సాధారణంగా ఎవరైనా గెలుపే మైలు రాయిగా భావిస్తారు. కానీ కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యేగా ఓటమే ఆయనకు అదృష్టాన్ని అందించింది. చిన్న ఎమ్మెల్యే పోస్టు పోయినా పెద్ద కేంద్ర మంత్రి పదవి ఆయన్ను వరించింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి తీవ్ర ఆవేదన చెందిన కిషన్ రెడ్డి తర్వాత కేవలం ఐదు నెలల్లోనే లోక్‌సభకు పోటీ చేశారు. సత్తా చాటారు. సికింద్రాబాద్ లోక్‌సభ నుండి పోటీ చేసిన ఆయన హోరాహోరీగా జరిగిన పోరులో 62 వేల భారీ మెజారిటీతో కిషన్ రెడ్డి గెలుపొందారు. దీంతో, రాష్ట్రం నుంచి కేబినెట్‌లో బెర్త్ అంటూ ఇస్తే కచ్చితంగా కిషన్ రెడ్డికే మొదటి అవకాశం వస్తుందని పార్టీ ముఖ్యులు భావించారు. నిజానికి 2014లోనే కిషన్ రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తారని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అప్పుడు అది జరగలేదు. ఇప్పుడు అసలు ఊహించకుండా ఇది జరిగిపోయింది.