MS Dhoni, Virat Kohli and some other premier members of Team India enjoyed some downtime in the woods before their World Cup 2019 campaign opener against South Africa on June 5. The Indian cricket board posted the pictures of their team's "fun day out in the woods" on their official Twitter account which led to fans raising various concerns about their national team. The ever-enthusiastic Indian cricket team fans' concern majorly revolved around their practice session, with some saying the Virat Kohli-led side might lose out on the World Cup 2019 trophy due to these fun times.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#viratkohli
#msdhoni
#jaspritbumrah
#kuldeepyadav
#dineshkarthik
#southampton
ప్రపంచకప్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కోహ్లీసేన సౌథాంప్టన్‌లో ఉంది. రెండు వార్మప్ మ్యాచ్‌లు ముగిశాక రెండు రోజులు నెట్స్‌లో తీవ్ర సాధన చేశారు టీమిండియా ఆటగాళ్లు. అయితే టీమిండియాకు జూన్ 5న మ్యాచ్ ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో విహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు పెయింట్ బాలింగ్ గేమ్ ఆడటానికి సౌతాంప్టన్ వెళ్లారు. కోహ్లీతో పాటు ఈ గేమ్ ఆడటానికి ధోనీ, చహల్, రాహుల్, ధావన్, దీపక్ చాహర్, బుమ్రా, కుల్దీప్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలు వెళ్లారు. ఈ ఆటకు సంబంధించిన ఫోటోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. 'ఫన్ టైమ్ విత్ బాయ్స్' అంటూ రాసాడు.ఆటగాళ్లు సైనిక దుస్తుల తరహాలో యూనిఫాం ధరించిన ఒక ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ప్రపంచకప్ లాంటి కీలక టోర్నీకి ముందు ఆటగాళ్లు నెట్స్‌లో సాధన చేయకుండా.. విహారానికి వెళ్లడంపై అభిమానులు విమర్శలు గుప్పించారు.