Political leaders including Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and others congratulated the Indian cricket team after the Men in Blue inflicted a humiliating 89-run defeat on their arch-rivals Pak in the 2019 ICC World Cup match.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#viratkohli
#amir
#AmitShah
#sarfaraz
ఆటగాళ్లు మారినా, మైదానాలు మారినా విశ్వ వేదికపై తమను ఓడించే సత్తా పాకిస్తాన్‌కు లేదని భారత్ ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన బిగ్‌ఫైట్‌లో భారత్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు ముందు ఎన్ని అంచనాలు ఉన్నా, ‘మ్యాచ్ ఆఫ్ ద టోర్నీ’ అంటూ ఇరు దేశాల్లో హడావిడి చేసినా అసలు పోరుకు వచ్చే సరికి భారత్ బలం ముందు పాక్ ఏమాత్రం నిలబడలేదని ఈ మ్యాచ్ కూడా నిరూపించింది. అయితే కోహ్లిసేన సాధించిన ఈ అద్భుత విజయంపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కోహ్లిసేన భారీ విజయాన్ని కొనియాడుతున్నారు.