టీడీపీ స‌భ్యులపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన స్పీకర్|Three Members Of The TDP Suspended From AP Assembly

Oneindia Telugu 2019-07-23

Views 110

Three members of the TDP suspended for present sessions by Speaker in AP Assembly. Assembly affairs minister Buggana Rajendra nath introduced suspension resolution in Assembly and Speaker implemented.
#apassemblysessions
#suspension
#tdp
#speaker
#ramanaidu
#achamnayudu
#bhuchaiahchowdary


ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత తొలి సారి ఏపీ శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మీద స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ స‌భ్యుడు నిమ్మ‌ల రామానాయుడు పాద‌యాత్ర స‌మ‌యంలో 45 సంవత్సరాలు నిండిన మ‌హిళ‌ల‌కు పెన్ష‌న్ ఇస్తామ‌ని చెప్పార‌ని దీని పైన ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించారు. అయితే, ప్ర‌భుత్వం జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ఏం చెప్పార‌నే అంశాన్ని స‌భ‌లో వీడియో ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ వీడియోలో జ‌గ‌న్ 45 ఏళ్లు నిండిన బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ మ‌హిళ‌ల‌కు వైయ‌స్సార్ చేయూత కింద ప్ర‌తీ ఏడాది ఆర్దిక సాయం అందిస్తామ‌నే విష‌యాన్ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. అయితే, దీని పైన చ‌ర్చ కోసం టీడీపీ స‌భ్యులు ఆందోళ‌కు దిగారు. ముఖ్య‌మంత్రి..ఆర్దిక మంత్రి సూచించినా వారు విన‌క‌పోవ‌టంతో..అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రి ముగ్గురు టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌కు తీర్మానం ప్ర‌తిపాదించారు. దీంతో..అచ్చెన్నాయుడు.. బుచ్చ‌య్య చౌద‌రి.. రామా నాయుడు పైన స‌స్పెన్ష‌న్ వేటు వేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS