బోనాల జాతరలో డాన్స్ చేసి అదరగొట్టిన మంత్రి | Talasani Awesome Dance At Secunderabad Bonalu Festival

Oneindia Telugu 2019-07-23

Views 883

Telangana Minister Talasani Srinivas Yadav Sensational Dance at Lashkar Ujjaini Mahankali Bonalu at Secunderabad
#talasanisrinivasyadav
#minister
#dance
#telangana
#lashkarbonalu
#Secunderabad

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బోనాల జాతర. గ్రామ దేవతలను కొలిచి మొక్కుతూ సల్లంగా చూడమ్మా అంటూ చిన్నా పెద్దా వేడుకలా జరుపుకునే అతి గొప్ప పండుగ. వ్యాధులు దరిచేరకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారి అంశలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలను కొలుస్తూ నిర్వహించే బోనాల వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఉత్సవంలో భాగంగా అమ్మోర్లకు బోనాలు సమర్పించడం, యాటలు కోయడం, చిన్నా పెద్దా చిందులేయడం ఆనవాయితీగా వస్తోంది. పల్లె సమైక్య జీవన విధానాన్ని చాటి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని ప్రబోధించేదే బోనాల వేడుక. ఆ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల వేడుకలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS