Students of a government primary school in Mirzapur district of Uttar Pradesh are being served salt and roti under the midday meal scheme. The midday meal scheme is designed to provide proper nutrition to scores of children from poor families who study in government schools across the country. A video posted on social media shows children sitting on the floor of the school corridor, eating rotis with just some salt in their plates.
#middaymeal
#uttarpradesh
#Mirzapur
#salt
#nutrition
#children
#Eggs
#banana
మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పట్టిందనడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారం అందించాలనే ఉద్దేశంలో ప్రారంభించిన మిడ్ డే మీల్ పథకం కొన్ని చోట్ల అభాసుపాలవుతోంది. కొందరి కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేలా తయారైంది పరిస్థితి. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు చర్చానీయాంశంగా మారింది. పోషకాహారం ఏమో గానీ ప్రతి నిత్యం అక్కడి విద్యార్థులకు రొట్టెలతో పాటు కూరలు ఇవ్వకుండా అనుసరిస్తున్న విధానం ఆరోపణలకు తావిస్తోంది. తాజా ఆకు కూరలు, విజిటెబుల్స్, గుడ్లు, పాలు అందించి వారిశారీరక ఎదుగుదలకు తోడ్పాటు అందించాల్సింది పోయి వారి జీవితాలలో ఆడుకుంటున్న వైనం వెలుగుచూసింది.