AP Government has decided to allow 10th class and intermediate exam failures to attend classes regularly and will give marks sheets as regular
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్ మీడియట్ పరీక్షలు, అలాగే వాటి అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సైతం ఫెయిలైన వారి కోసం ప్రభుత్వం తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం వారు ఇకపై పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ తరగతులకు హాజరై తిరిగి చదువుకుని పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. సాధారణంగా అయితే ఈ పరీక్షల్లో ఓసారి ఫెయిలైతే తిరిగి క్లాసులకు హాజరయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం సానుకూల దృష్టితో ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఇలా టెన్త్, ఇంటర్ పరీక్షలు ఫెయిలైన తర్వాత కూడా కాలేజీలకు వెళ్లి చదువుకోవాలని భావించే విద్యార్ధులకు ప్రభుత్వం ఓ షరతు పెట్టింది. వీరు తాము ఫెయిలైన సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టులను కూడా చదవాల్సి ఉంటుంది.
#apgovernment #10thclass #intermediateexams #intermediatefailures #10thfailures #apcmjagan #markssheets #students #exams
~PR.38~