టాప్ 10 న్యూస్
1. వెనకడుగు లేదు... 2024 చంద్రయాన్-3 : ఇస్రో శాస్త్రవేత్తలు
చంద్రయాన్-2 కంటే మరింత ఉన్నతమైన రీతిలో జపాన్ దేశ సహకారంతో దీనికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఒకవేళ ఉభయదేశాల మధ్య ఒప్పందం కుదిరితే 2024లో సంయుక్తంగానే చంద్రుడిపైకి సరికొత్త ఉపగ్రహాన్ని పంపే అవకాశం ఉంది.
2. ట్రక్కు డ్రైవర్‌కు దేశంలోనే అత్యధిక అపరాధం
ఒడిషా రాష్ట్రంలోని సంబల్‌పూర్ జిల్లాలో అశోక్ జాదవ్ అనే ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ.86,500 జరిమానా విధించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికం.
3. తెలంగాణ బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు: ఆర్థి లోటు రూ.24.08 వేల కోట్లు
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం రూ.1,46,492.3 కోట్లు, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,077.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లుగా బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నారు.
4. విక్రమ్ ల్యాండర్‌ను అడ్డుకున్న వింత జీవులు? నీటి ఎలుగుబంటి ఆ పని చేసిందా?
తాజాగా ఓ వైరెట్ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. వైరెడ్ అనే ట్విట్టర్ నుంచి ఓ వ్యక్తి చేసిన ట్వీట్ చూస్తే... గ్రహాలు, ఉపగ్రహాల పైన కొన్ని రకాల బ్యాక్టీరియాలు వుంటాయి. అలాంటిదే టార్డిగ్రేడ్. దీనిని తెలుగులో నీటి ఎలుగుబంటి అంటారు. ఇది చంద్రుడిపై ల్యాండర్ దిగకుండా అడ్డుకున్నదంటూ ట్వీట్లో తెలిపాడు.
5. కేసీఆర్ రసం లేని ఆర్టీసీ ఛైర్మన్ గిరి ఇస్తామన్నారు... వద్దన్నా : నాయని ఫైర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెరాస సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా పని చేసిన నాయిని నర్సింహా రెడ్డి విమర్శలు గుప్పించారు. తనకు పదవి ఇస్తామని కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు.
6. సౌతిండియాలో ఎక్కడైనా.. ఎపుడైనా ఉగ్రదాడి జరగొచ్చు : ఆర్మీ హెచ్చరిక
దక్షిణ భారతదేశంలో ఎపుడైనా, ఎక్కడైనా దాడి జరగొచ్చని ఆర్మీ హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడే అవకాశం ఉందని లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ హెచ్చరించారు.
7. కేసీఆర్ బడ్జెట్ బండారాన్ని బయటపెట్టిన పొన్నాల లక్ష్మయ్య
ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజల దృష్?