Madhya Pradesh Chief Minister Kamal Nath on Friday submitted his resignation to state Governor Lalji Tandon ahead of the floor test mandated by the Supreme Court.
#MadhyaPradeshFloorTest
#KamalNathResignation
#bjp
#congressrebalmlas
#mppoliticalcrisis
#modi
రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలలోగా బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నించానని అన్నారు. కాగా, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం, వారిలో 16 మంది రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో బలనిరూపణకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు ఈ నేపథ్యంలో డిగ్గీతో చర్చించిన కమల్ నాథ్.. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేసారు