Delhi Earthquake: Watch Earthquake of Magnitude 3.5 Hits Delhi-NCR

Oneindia Telugu 2020-05-10

Views 2.1K

An earthquake measuring 3.5 on the Richter scale shook parts of Delhi on Sunday afternoon. No loss of life or property was reported. This is the third earthquake in Delhi in less than a month. Massive dust storm enveloped Delhi-NCR and brought sudden change in weather. After the dust storm, rain lashed parts of national capital. This sudden change of weather dropped the temperature and brought respite for Delhiites.

#DelhiEarthquake
#3.5MagnitudeEarthquakeHitsDelhiNCR
#Duststorm
#Delhi
#weather
#temperature
#DelhiNCR

కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న దేశ రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఉన్నట్టుండి వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పులు ఢిల్లీ ప్రజలు ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సమయంలోనే.. పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ భూ ప్రకంపనలతో ఢిల్లీవాసులు భయాందోళనలకు గురి అయ్యారు. ఇళ్లను విడిచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని వజీరాబాద్‌ను భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతున భారీ భూకంపం సంభవించిందని, దాని ప్రభావం వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకంపనల ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కనిపించింది. కొన్ని సెకెన్ల పాటు ప్రకంపనలు నమోదు అయ్యాయి.

Share This Video


Download

  
Report form