Delhi To Be Hit By Earthquake ? But Here Is The Truth

Oneindia Telugu 2018-03-22

Views 2.1K

A WhatsApp message has gone viral that says Delhi will soon suffer a huge earthquake of magnitude 9.1 on the Richter scale. The panic the fake message created also spread to Twitter

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించబోతోందని సోషల్ మీడియాలో సందేశాలు ఇప్పుడు కలకలంగా మారాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఇప్పటికే హెచ్చరికలు చేసిందంటూ ఆ సందేశాల్లో పేర్కొనడం జరిగింది.
ఏప్రిల్‌ 7 నుంచి 15లోపు ఢిల్లీలో ఒక తీవ్రమైన భూకంపం రానుంది. రిక్టారు స్కేలు మీద దాని తీవ్రత 9.1-9.2గా నమోదు కానుంది. లక్షల మంది ప్రాణాలు కొల్పోనున్నారని పేర్కొంటున్న వాట్సప్ సందేశాలు ఢిల్లీ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి.
అంతేగాక, ‘గురుగ్రామ్‌లో సంభవించబోయే ఈ భూకంపం ప్రపంచంలో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించిన వాటిలో రెండవది కానుంది. భారతదేశంలోని రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, జమ్మూకాశ్మీర్‌, తమిళనాడు, బీహార్‌ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి గురికానున్నాయి' అని ఆ సందేశాల్లో పేర్కొనడం జరిగింది.
ఇంకా, ‘పాకిస్థాన్‌లో కూడా భూకంపం రానున్నట్లు అక్కడ దీని తీవ్రత 4-4.2 వరకు నమోదు కానున్నట్లు ఈ సందేశం సారాంశం. ‘ఢిల్లీలో ఉంటున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. వారిని ఒక వారం పాటు ఢిల్లీని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లమని చెప్పండి. ప్రభుత్వం తొందరలోనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే నాసాఅలర్ట్‌.కామ్‌లో చూడండి' అని ఆ సందేశాల్లో ఉంది.
అయితే, నిజంగానే ఢిల్లీలో భూకంపం రానుందా? అంటే మాత్రం అదేమి లేదు. ఇది ఒక ఫేక్‌ మెసేజ్‌. మెసేజ్‌లో చాలా స్పెల్లింగ్‌ మిస్టెక్‌లు ఉండటమే గాక ఒక ముఖ్యమైన ప్రాధమిక అంశాన్నే అది మర్చిపోయింది.

Share This Video


Download

  
Report form