ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ తన పానిగలే వి 2 బైక్ యొక్క టీజర్ వీడియోను ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసింది. కొత్త డుకాటీ పానిగలే వి 2 బైక్ ఇప్పటికే భారతదేశంలో విడుదల చేయాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా డుకాటీ ఈ కొత్త పానిగలే వి 2 బైక్‌ను భారతదేశంలో విడుదల చేయడంలో కొంత ఆలస్యం జరిగింది.
డుకాటీ తన పానిగలే వి 2 బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా డుకాటీ ఇటీవల ఈ పానిగలే వి 2 బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డుకాటీ పానిగలే వి 2 బైక్ ఆగస్టు చివరి నాటికి భారతదేశంలో విడుదల కానుంది.