India vs Australia : BCCI Tweets team india practice session videos. Video Credits : BCCI.
#Bcci
#ViratKohli
#Indvsaus
#Indiavsaustralia
#Teamindia
#Natarajan
బయో బబుల్‌ను దాటకుండా తమకు ఇచ్చిన వెసులు బాట్లను ఉపయోగించుకుంటూ.. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఐపీఎల్ అనంతరం విరామం తీసుకోకుండానే వచ్చిన పని కోసం సన్నాహకాలు స్టార్ట్ మొదలుపెట్టింది. దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో ఆటగాళ్లు అవుట్‌డోర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. శనివారమే సాధన ప్రారంభించినా, తొలిరోజు జిమ్‌లో కసరత్తులు, రన్నింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. రెండోరోజైన ఆదివారం పూర్తిస్థాయిలో ఆటగాళ్లంతా సాధనకు దిగారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో, జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.