Watch Hyderabad Metro turns lifeline, transports heart for transplant from LB Nagar to Jubilee Hills.
#HyderabadMetro
#Metrotransportsliveheartfortransplant
#Greenchannel
#HeartTransplant
#HyderabadMetroturnslifeline
#JubileeHillsmetrostation
#ApolloHospitals
#transportsheartfortransplant
#KamineniHospital
ఎప్పుడూ రోడ్డు మార్గం ద్వారానే అత్యవసరమైన అవయవాల రవాణా ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జరుగుతుండేది. కానీ, తొలిసారి హైదరాబాద్ మెట్రో రైలును గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఉపయోగించారు. నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో అత్యవసరంగా గుండె తరలింపునకు హైదరాబాద్ మెట్రోను ఎంచుకున్నారు వైద్యులు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ గోకులే నేతృత్వంలోని ఆపరేషన్ జరగనుంది. ఈ క్రమంలో తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపునకు అధికారులు సిద్ధమయ్యారు. ఆస్పత్రి సిబ్బంది మెట్రో రైలు అధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్రో అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.