Andhra Pradesh MPTC, ZPTC elections: Elections are being held for 515 ZPTC seats and 7220 MPTC in the state.
#MPTCZPTCPolls
#AndhraPradeshMPTCZPTCelections
#MPTCZPTCVoting
#Janasena
#YSRCP
#APCMJagan
#TDP
#Pawankalyan
#Apnews
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిపి మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 2,44,71,002 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఏపీలో పరిషత్ ఎన్నికల కోసం ఎస్ఈసీ సకల ఏర్పాట్లు చేసింది. కాగా, మొత్తం 27,751 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు సగం సమస్యాత్మక కేంద్రాలే కావడం గమనార్హం. 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 47.03% పోలింగ్ కేంద్రాల్లోనూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.