Hanuma Vihari's network of volunteers helps out during 'unthinkable' Covid-19 crisis
#HanumaVihari
#Teamindia
#WTCFinal
#Indvseng
#IndvsNz
#Washingtonsundar
దేశంలో ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. దేశంలో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన వేళ.. తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు విహారి సాయం చేస్తున్నాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందజేస్తున్నాడు.