WTC Finals : MSK Prasad reveals why Rohit Sharma was promoted as opener in Test format
#RohitSharma
#Teamindia
#Mskprasad
#WtcFinal
#Worldtestchampionship
టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని చెప్పింది తానేనని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. తన హయాంలోనే రోహిత్ ఓపెనర్‌గా అవకాశం అందుకొని సత్తాచాటాడని ఈ తెలుగు కామెంటేటర్ గుర్తు చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఎలా నిలదొక్కుకున్నాడనే విషయాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు. వన్డేల్లో స్థానం కోసం ఇబ్బంది పడినట్లే.. టెస్టుల్లోనూ కష్టాలను ఎదుర్కొన్నాడని వెల్లడించాడు. హిట్‌మ్యాన్ కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులను చవిచూశాడని గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెస్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.