Suresh Raina calls Greg Chappell top 'Talent Hunter', reveals his role in getting MS Dhoni
#SureshRaina
#Teamindia
#MsDhoni
#GregChappell
వన్డే క్రికెట్‌లో లక్ష్యాలను ఎలా ఛేదించాలో, విజయాలను ఎలా సాధించాలో భారత జట్టుకు నేర్పింది మాజీ కోచ్ గ్రేగ్ చాపెలేనని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. తన ఆత్మకథ 'బిలీవ్'బుక్‌ను సోమవారం విడుదల చేయనున్న రైనా.. ఈ సందర్భంగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జట్టు వాతావారణాన్నే చాపెల్ మార్చేశాడని గుర్తు చేసుకున్నాడు. ధోనీ, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లను అతనే జట్టులోకి తీసుకొచ్చాడని, యువ ఆటగాళ్లతో జట్టు డెవలప్ చేశాడన్నాడు.ఇక తన కెరీర్ ఆరంభంలో డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉండేదో కూడా రైనా చెప్పుకొచ్చాడు. ఓ సీనియర్ ప్లేయర్ తనను కించపర్చాడని కూడా ఈ మాజీ బ్యాట్స్‌మన్ గుర్తు చేసుకున్నాడు.