ICC WTC Final 2021: Saturday 19th looks largely dry for Southampton, But there is a strong signal for heavy rain on Sunday and Monday.
#WTCFinal
#WTCFinalDay2
#WTCFinalHilariousTrolls
#ViratKohli
#Southamptonweather
#2019ODIWorldcup
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill
చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ తొలిరోజును తుడిచి పెట్టేసిన వరుణ దేవుడు.. కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. రెండో రోజు ఆటకు అవకాశం ఇచ్చాడు. మార్నింగ్ సెషన్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తోన్నప్పటికీ- ఉదయం పూట కొన్ని గంటలపాటు తెరపినిస్తుందని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రకారం చేసుకుంటే కనీసం రెండు సెషన్ మ్యాచ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే- భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడటానికి ఛాన్స్ ఉంది. బ్రిటన్ కాలమానం ప్రకారం.. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు వర్షం పడే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పాక్షికంగా ఎండ పడుతుందని అంచనా వేశారు. మధ్యాహ్నం తరువాత మళ్లీ సాయంత్రం వరకూ వర్షం పడుతుందని, రాత్రికి కాస్త విరామం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనితో తొలి రెండు సెషన్ల మ్యాచ్‌ను ఆడటానికి భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్ధపడతాయి.