ICC WTC Final: Virat Kohli calls for best-of-three WTC finals to decide Test champions: Can't be over two days of good cricket
#WTCFinal
#ViratKohli
#WTCFinalNZWon
#WTCReserveDay
#IndiaWonWTCFinal
#INDVSNZ
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను బెస్టాఫ్ 3 ఫార్మాట్‌లో నిర్వహించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఒక్క మ్యాచ్‌తో ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయడం అనే విషయాన్ని తాను అంగీకరించనని చెప్పాడు. ఫైనల్లో ఒకటి కాకుండా మూడు మ్యాచ్‌లు నిర్వహించాలని, అప్పుడు ఎవరు బాగా ఆడితే వారిని విజేతగా గుర్తించాలని కోహ్లీ సూచించాడు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.