Good news for csk and dhoni fans.
#Dhoni
#Chennaisuperkings
#Csk
#Ipl2021
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. గతేడాది ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు చాలా నిరుత్సాహపపడ్డారు. టీ20 ప్రపంచకప్ ఆడితే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా మహీ ఆటను చూడొచ్చని అభిమానులు ముచ్చటపడ్డారు. అయితే ధోనీకి ఐపీఎల్ 2021 చివరి సీజన్ కావచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సీఈవో కాశీ విశ్వనాథన్ ఈ వార్తలకు చెక్ పెట్టారు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కాదని ఆయన స్పష్టం చేశారు.