Overseas Players priority for ipl 2021 than other tournaments.
#Ipl2021
#Overseasplayers
#Csk
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌లను ఇప్పుడు యూఏఈ, ఓమన్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనుంది. భారతదేశంలో ఇప్పటికే 29 మ్యాచ్‌లు నిర్వహించగా.. మిగిలిన 31 మ్యాచ్‌లు మొత్తంగా నాలుగు మైదానాల్లో జరుగుతాయి. అయితే కొన్ని రోజుల క్రితం విదేశీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనడంపై పలు సందేహాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు కొందరు ఐపీఎల్ ఆడనున్నారని ఓ క్రిడా ఛానెల్ పేర్కొంది.