Prabhas all praise about Akash Puri and Ketika Sharma in Romantic trailer
#RomanticTrailer
#AkashPuri
#Prabhas
#RomanticMovie
#KetikaSharma
#PuriJagannadh
టాలీవుడ్ సీనియర్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఆకాష్ పూరి సరైన విజయాన్ని అందుకోలేదు. తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన మహబూబా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని రొమాంటిక్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ స్టోరీ స్క్రీన్ ప్లే మాటలు అందించగా ఆయన శిష్యుడు అనిల్ పడురి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ ను నేడు ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశారు. ఇక ట్రైలర్ లోకి వెళితే పూరి మార్క్ కు తగ్గట్టుగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.