T20 World Cup 2021: South Africa opener Quinton De Kock Apologizes And Says He Is Not Against To BLM Movement.
#T20WorldCup2021
#BLMMovement
#QuintonDeKockApologizes
#INDVSNZ
#TeamIndiaSquad
#RohitSharma
#ViratKohli
#ShardulThakur
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు కిందకి దిగొచ్చాడు. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి తాను మద్దతు తెలుపుతానని చెప్పాడు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిలబడటం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నానన్నాడు. ఒమన్, యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021లో ఇకపై దక్షిణాఫ్రికా జట్టు ఆడే ప్రతి మ్యాచులో తాను మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలుపుతానని డికాక్ స్పష్టం చేశాడు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ విషయంలో పొరపాటు చేసినందుకు తనను సహచరులు మరియు అభిమానులు క్షమించాలని కోరాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ ఖాతాలో డికాక్ ఓ పోస్ట్ చేశాడు.