India Vs New Zealand: Atmosphere deteriorates in Jaipur before India-New Zealand T20 series starts, first match in trouble
#INDVSNZ1stT20
#IndiaVsNewZealand
#JaipurAQI
#SawaiMansinghStadium
#AirPollution
భారత పర్యటనలో కివీస్ మూడు టీ20ల సిరీస్, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 17న ఇరు జట్ల మధ్య పొట్టి సిరీస్ ఆరంభం కానుంది. అయితే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం తొలి టీ20 జరిగే జైపూర్ గాలిలో కాలుష్యం స్థాయి బాగా పెరిగినట్లు తెలుస్తుంది. జైపూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం గత వారం నుంచి జైపూర్‌లో కాలుష్యం స్థాయి పెరిగింది. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత దారుణంగా ఉందని, పొగ మంచు బాగా ఉందని నివేదిక పేర్కొంది. గాలి ఏక్యూఐ 337 వద్ద నమోదైంది. దీపావళి తర్వాత ఈ స్థాయిలో ఏక్యూఐ నమోదవడం ఇది రెండోసారి. తొలి టీ20 జరిగే సమయానికి కూడా ఎయిర్ ఏక్యూఐ ఇంచుమించు స్థాయిలో ఉంటుందని సమాచారం. దాంతో టీ20 మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగేది లేనిది ఆరోజు తేలనుంది.