India got the better of New Zealand by six runs in the rain-affected third T20 in Thiruvananthapuram to win the series 2-1. The match got delayed due to rain and was curtailed to a 8 overs.
తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20లో విజయం సాధించడంతో 2-1తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మూడో టీ20 మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 67 పరుగులు చేసింది. ఒక మోస్తారు లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు.
భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (8), శిఖర్ ధావన్ (6), విరాట్ కోహ్లీ (13), అయ్యర్ (6), మనీష్ పాండే (17), హార్థిక్ పాండే (14) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఇష్ సోధీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్డ్ ఒక వికెట్ తీశాడు.