Rachin Ravindra, Ajaz Patel defy India spinners to earn draw in Kanpur
#Teamindia
#Rachinravindra
#Azazpatel
#IndVsNz
#Nitinmenon
భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠగా జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆఖరి బంతి వరకు భారత్‌ను ఊరించిన విజయం తృటిలో చేజారింది. ముఖ్యంగా న్యూజిలాండ్ అరంగేట్ర ప్లేయర్ రచిన్ రవీంద్ర భారత్ విజయాన్ని లాగేసాడు. భారత సంతతికే చెందిన రచిన్ రవీంద్ర.. తన తొలి టెస్ట్‌లోనే దుమ్ములేపాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్ రవీంద్ర.. 91 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఓటమికి అడ్డుగోడలా నిలిచాడు. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఓవైపు వికెట్లు కోల్పోయినా.. మరో ఎండ్‌లో ఆజాజ్ పటేల్ సాయంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.