Farmers Protest in Srikakulam: చదును చేసేందుకు యత్నం, అడ్డుకున్న రైతులు, తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

Abp Desam 2022-06-08

Views 4

Srikakulam జిల్లా ఎచ్చెర్ల మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిలకాపాలెం గ్రామ పరిధిలోని 170 ఎకరాల నారాయణపురం ఈ-నాం భూములను చాలా దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. వాటిపై హక్కులు కల్పించాలని గతంలోనే 190 రోజుల రిలే దీక్షలు చేశారు. ఇప్పుడు ఆ భూములను చదును చేసేందుకు పోలీసు బందోబస్తుతో సహా కొందరు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులంతా ఆందోళన చేపట్టారు. భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS