కాకినాడ జిల్లా పరిధిలో పెద్దపులి జాడ ఇంకా దొరకలేదు. టైగర్ కోసం అటవీశాఖ అధికారుల ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కొద్ది రోజులుగా చిక్కక, దొరకక.. మరికొన్ని సార్లు చిక్కినట్లే చిక్కి అటవీశాఖ అధికారులకు ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి రోజుకో ఊరు మార్చుకుంటూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.