అగ్నిపథ్ పై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించేందుకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. సైనిక వ్యవహారాల అదనపు సెక్రటరీ, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తతుం అగ్నిపథ్ లో భాగంగా 46 వేల మందిని తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టులా చేపట్టామని, పూర్తిస్థాయిలో పరిశీలించాక క్రమంగా విస్తరిస్తామన్నారు. డిసెంబర్ నాటికి అగ్నివీరుల తొలి బ్యాచ్ సిద్ధమవుతుందన్నారు. అగ్నిపథ్ లో ఎంపికైనవారు... ఇటీవల జరిగిన అల్లర్లలో పాల్గొనలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.