బాపట్ల జిల్లా నడిగడ్డపాలెంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు సందడి చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నడిగడ్డపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత మాట్లాడిన రాఘవేంద్రరావు...ఎన్టీఆర్ పౌరుషం కార్యకర్తల గుండెల్లో ఉందన్నారు. వేదికపైన ఉన్నవాళ్లంతా ఏడాదిన్నరలో ఉన్నతపదవుల్లో ఉంటారని నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజాను ఉద్దేశించి రాఘవేంద్రరావు అన్నారు.