తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ ప్రమాణస్వీకార మహోత్సవం ఆసక్తికరమైన ఘటనకు వేదికైంది. గత కొంత కాలంగా రాజ్ భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం కేసీఆర్....జస్టిస్ ఉజ్జల్ భుయన్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ను మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ కలిశారు. జస్టిస్ ఉజ్జల్ భుయన్, సీఎం కేసీఆర్ తో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మాట్లాడారు.