జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయే BJP National Executive Meeting కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇక్కడికి రాబోతుండటంతో దృష్టి అంతా ఈ మీటింగ్ పైనే ఉంది. ఈ మీటింగ్ కు సంబంధించి యాదమ్మ అనే మహిళ కాస్త ట్రెండింగ్ గా మారారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈమెను..... ప్రధాని మోదీకి వంట చేసేందుకు.... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా ఎంపిక చేశారు. తెలంగాణ స్పెషల్ వంటకాలను ఆమె తయారు చేయబోతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ చెఫ్స్ తో కలిసి వంటకాలపై చర్చించారు.