The Jagan government came down due to the concern expressed by the teachers over the decision taken by the AP government regarding the attendance of teachers through face recognition app. With this, relaxations have been imposed in the teachers attendance app | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు హాజరు కోసం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది. మొదట తొమ్మిది గంటలకు ఒక నిమిషం లేటైనా ఆబ్సెంట్ గా పరిగణిస్తామని చెప్పి యాప్ ను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు అటెండెన్స్ విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించడంతో 9 గంటలకు మరో పది నిమిషాల గ్రేస్ సమయాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
#APSchools
#SIMSAP
#ChangesinSIMSAP
#AndhraPradesh
#APschoolEducationDepartment
#YCP
#CMjagan