తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించేదంకు 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చారు. వారి టూర్ రెండవ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. ఉదయం ప్రగతి భవన్ కు రైతు సంఘాల నేతలు చేరుకున్నారు. వ్యవసాయం, సాగునీటి తదితర రంగాలపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో రూపొందించిన డాక్యుమెంటరీ తిలకించారు. అది చూసిన రైతు సంఘాల నేతలు.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. అనంతంరం.. వారంతా కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. రైతాంగ క్షేమం కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో కేసీఆర్ సూచనలు చేశారు.