Shubman Gill impressed the critics with his quick fire innings in INDvsNZ second ODI. Though, the match was called off | న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా 12.5 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. ఆడింది తక్కువ సమయమే అయినా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను.. రెండో వన్డేలో 42 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇటీవలి కాలంలో యువ ఆటగాళ్లంతా బంతిని బలంగా బాదుతూ, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ గిల్ మాత్రం వాళ్లకు భిన్నంగా బంతిని టైమింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
#INDvsNZ
#RaviShastri
#ShubmanGill
#Cricket
#National