ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నం.208లో లోకేశ్ కార్యాలయం సిద్ధం చేశారు. మెగా డీఎస్సీ దస్త్రంపైనే మంత్రి లోకేశ్ తొలి సంతకం చేశారు. అదే విధంగా రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర కూడా బాధ్యతలు స్వీకరించారు.