SLBC meeting Chaired by CM Chandrababu: నగదు బదిలీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు బ్యాంకర్ల సాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మొదటిసారి నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలతోపాటు బ్యాంకింగ్ రంగాన్నీ ఛిన్నాభిన్నంచేసిందని సమావేశంలో మంత్రులు పేర్కొన్నారు.