AP Budget 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ (AP Budget 2024) ప్రవేశపెట్టింది. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవం పోయడమే లక్ష్యమని ప్రకటించింది. సరళమైన ప్రభుత్వం ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని ఉద్ఘాటించింది.