Congress Party Focus On Joinings : రాష్ట్రంలో అధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి