మూడోరోజూ ఉద్రిక్త పరిస్థితుల మధ్య మూసీ నది ప్రక్షాళన - పలు చోట్ల సర్వే అధికారులను అడ్డుకున్న నిర్వాసితులు

ETVBHARAT 2024-09-27

Views 1

Musi River Survey 3rd Day : మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వే మూడోరోజు కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగింది. నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీపీ వ్యాన్లను తిప్పి పంపించారు. అడుగడుగునా అధికారులతో వాగ్వాదానికి దిగుతూ ఇళ్లు ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు. లంగర్‌హౌస్‌, బహదూర్‌పురాలో పెద్దసంఖ్యలో బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. న్యూ మారుతీనగర్‌లో స్థానికులు సర్వే అధికారులపై తిరగబడ్డారు. స్థానికులకు మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్​ఎంసీ 14 మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS