వైఎస్సార్సీపీ హయాంలో హోలోగ్రామ్‌ టెండర్లనూ వదల్లేద

ETVBHARAT 2024-12-12

Views 1

Security Holograms Printed on Liquor Bottles During YSRCP Govt : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హోలోగ్రామ్‌ టెండర్ల వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ అభ్యర్థన మేరకు రాష్ట్ర సీఐడీని ప్రతివాదిగా చేరుస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS