హైదరాబాద్​లో భారీ వర్షం

ETVBHARAT 2025-05-22

Views 133

Heavy Rains in Hyderabad : ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌ నగరం తడిసిముద్దయ్యింది. అనేక ప్రాంతాలో రోడ్లపైకి నీరు చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం తర్వాత వర్షం పెరగడంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, సంతోష్‌నగర్‌, పాతబస్తీ సహా దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్నిచోట్ల చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS