Bengaluru stampede - ఈ ఎరుపు చాలా ఇంకా కావాలా ? RCB 18 ఏళ్ల కలకు 11 ప్రాణాలు బలి | Oneindia Telugu

Oneindia Telugu 2025-06-05

Views 54

Bengaluru stampede - అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా..? అంటూ సింధూరం సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన పాట బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటూ, ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నామని సంబరపడాలా? లేదా దేశ యువత రీ రిలీజ్లు, బెనిఫిట్ షోలు, ఐపీఎల్ ట్రోఫీలు, బిగ్ బాస్ కోసం సోషల్ మీడియాలో వార్ లు చేసుకుంటున్నారని భాదపడాలో అర్ధం కావటం లేదు. తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకోవడానికి 11 మంది ప్లేయర్లు సమిష్టిగా రాణించి, ఒక ఐపీఎల్ కప్ కొట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకున్నందుకు చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలు 24 గంటలు తిరగకుండా విషాద ఛాయలు మిగిల్చాయి. 18 ఏళ్ల కల నెరవేరిన వేళ 11 మంది జీవితాల్లో మృత్యు ఘటింకలు మోగాయి. ఐపీఎల్ చరిత్రలో ఆర్బీబీ జట్టుకు మరో 18 ఏళ్లు పాటు గుర్తుండిపోయే చీకటి రోజుగా ఈ విజయోత్సవ మృత్యు హేళికలు నిలిచిపోతాయి.

Bengaluru stampede - A critical reflection on the Bengaluru stampede during RCB's IPL victory celebrations that claimed 11 lives. This article explores the dangerous obsession with fandom, social media hype, and misplaced priorities in modern society.

#StampedeatChinnaswamyStadium
#ChinnaswamyStadium
#RCBStampede
#BengaluruTragedy
#RCBVictoryParade
#ChinnaswamyStampede
#RCBWinTurnsTragic
#RCBFansMourn
#Stampede
#BangaloreEvents

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS