Senior India batsman Rohit Sharma feels pacers Jasprit Bumrah and Bhuvneshwar Kumar are the world's best bowlers and the duo have contributed significantly to the recent limited overs success of the team.
భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంలో భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక, బుమ్రా కివీస్‌ను 331 పరుగులకే కట్టడి చేయడంలో చివరి ఓవర్ ఎంతో కీలకమని అన్నాడు.