Bhagmati' will be Anushka's first film after 'Baahubali'. The makers have kept every little detail about the film under tight wraps, building curiosity amongst fans. Speculations are doing rounds that Anushka will play the role of an IAS officer in the movie.As per the latest update 'Bhagmati's' first look will be released on November 6 at 6:55 pm.
బాహుబలి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇదే తరహాలో భాగమతిగా అనుష్క తన పెర్‌ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది. పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' చిత్రం తెరకెక్కుతోంది. 'భాగమతి' ఫస్ట్ లుక్ నవంబర్ 6న సాయంత్రం 6.55 గంటలకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాతలు వంశీ, ప్రమోద్ 'భాగమతి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుందని యువి క్రియేషన్స్ ప్రతినిధులు తెలిపారు. నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్