Director Shankar on Tuesday unveiled the first look of upcoming Kamal Haasan starrer Indian 2. Sharing the poster of Indian 2 on Twitter, Shankar wrote, “#indian2 Hi everyone! Happy Pongal.”
#indian2
#kamalhaasan
#shankar
#kajalagarwal
#HappyPongal2019
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ 2.0 తర్వాత మరో బిగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ (భారతీయుడు)కు సీక్వెల్ 'ఇండియన్ 2'తో రాబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో జనవరి 18 నుంచి సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీలో విడుదల కానుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్ హాసన్ సేనాపతిగా దర్శనమిచ్చారు. 1996లో వచ్చిన భారీయుడు సినిమాలో ప్రాచీన యుద్ధవిద్య మర్మకళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఈ మర్మకళను ప్రధానంగా చూపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత బిగ్ ప్రాజెక్టులో నటించే అవకాశం రావడంతో చాలా హ్యాపీగా ఉంది. ‘కొత్త ప్రయాణం, కొత్త అనుభూతి... ఇండియన్ 2 సినిమా షూటింగులో ఎప్పుడు జాయిన్ అవుతానో అనే ఎగ్జైట్మెంటులో ఉన్నాను.' అని కాజల్ ట్వీట్ చేశారు.