Sri Lanka skipper Dinesh Chandimal dropped hints that unlike five-pronged bowling theory which yielded results against Pakistan in the humid conditions in the UAE, he may revert to four-bowler theory against India.
భారత్‌తో టెస్టు సిరిస్‌కు నాలుగు బౌలర్ల వ్యూహంతో మైదానంలోకి దిగే అవకాశం ఉందని శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ అన్నాడు. ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అక్కడి ఉష్ణ వాతావరణంలో పాకిస్థాన్‌పై విజయవంతమైన ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని భారత్‌లో అమలు చేయమని చెప్పుకొచ్చాడు. 'పాకిస్థాన్‌పై మేం ఆరుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో ఆడాం. ఉత్కపోత వాతావరణంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అక్కడ నలుగురు బౌలర్లతో ఆడి గెలవడం సులభం కాదు. కానీ టీమిండియాలో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అందుకే మేం ఆల్‌రౌండర్ గురించి ఆలోచిస్తున్నాం' అని చండిమాల్ అన్నారు.
భారత్‌లో కోహ్లీసేనతో ఆడడం తమకు పెద్ద సవాలేనన్న చండీమాల్... గతంలో ఇక్కడ తమ ఆటతీరు గురించి ఆలోచించకుండా ఇప్పుడెలా ఆడాలన్నదానిపై దృష్టి సారించామని అన్నాడు. 'శ్రీలంక 1982 నుంచి భారత్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. సొంతగడ్డపై ఈ ఏడాది జరిగిన సిరీసుల్లో కోహ్లీసేన చేతిలో క్లీన్‌స్వీప్ అయింది' అని చండిమాల్ అన్నాడు.